ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అచ్చెన్న అరెస్టు అవినీతికి పాల్పడినందుకా.. కక్ష సాధింపు కోసమా..?'

అవినీతి ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తామని.. అయితే ఈఎస్​ఐ వ్యవహారంలో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టులో అధికారులు నిబంధనలు పాటించనట్లు కనిపిస్తుందని జనసేన తెలిపింది. అచ్చెన్నాయుడిని అవినీతికి పాల్పడినందుకు అరెస్టు చేశారో.. రాజకీయ కక్ష సాధింపు కోసం అరెస్టు చేశారో తేలాల్సి ఉందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్​ అన్నారు.

'అచ్చెన్న అరెస్టు అవినీతికి పాల్పడినందుకా.. కక్ష సాధింపు కోసమా..?'
'అచ్చెన్న అరెస్టు అవినీతికి పాల్పడినందుకా.. కక్ష సాధింపు కోసమా..?'

By

Published : Jun 12, 2020, 4:52 PM IST

ఈఎస్​ఐ కుంభకోణంలో టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టులో నిబంధనలు లోపించినట్లు కనిపిస్తున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్​ అన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న ఆయన.. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి అరెస్టు సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

అచ్చెన్నాయుడిని.. అవినీతికి పాల్పడినందుకా.. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం అరెస్టు చేశారా అనేది తేల్చాలని నాదెండ్ల ప్రశ్నించారు. ఎమ్మెల్యే అరెస్టుకు ముందు రాజ్యాంగ నిబంధనలు పాటించాలని సూచించారు. అన్ని అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని నాదెండ్ల డిమాండ్​ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details