పార్టీ ముఖ్య నేతలు, ఇన్‌ఛార్జులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో హింసపై మౌనంగా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరింత రెచ్చిపోతారని అన్నారు. నామినేషన్లలో ఎదురైన ఇబ్బందులు, దాడులపై సమాచారం ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారుల వివిరాలు పంపాలని తెలిపారు. పూర్తి నివేదికను కేంద్ర హోంశాఖతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తానని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.
'సమాచారం ఇవ్వండి..కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా' - pawan comments on local elections news
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పార్టీ అభ్యర్థులకు ఎదురైన ఇబ్బందులు, దాడులపై సమాచారం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ పార్టీ నేతలకు సూచించారు. అందుకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేస్తానని తెలిపారు.
Janasena chief Pawan kalyan review with party leaders on local elections