కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని వినతిపత్రం ఇచ్చారు. ప్రజల మనోభావాలు గ్రహించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పవన్ కోరారు. అప్పులు త్వరగా మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న పవన్... విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణతో 18 వేలమంది శాశ్వత ఉద్యోగులపై ప్రభావం పడుతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ ప్రైవేటీకరణతో 20 వేలమంది ఒప్పంద ఉద్యోగులపై ప్రభావం ఉంటుందన్నారు. పరోక్షంగా మరో లక్షమంది జీవితాలపై ప్రభావం ఉంటుందని వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక గనులు కేటాయించాలి: పవన్ కల్యాణ్ - దిల్లీలో అమిత్‌షాతో పవన్ కల్యాణ్ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణతో 18 వేలమంది శాశ్వత ఉద్యోగులపై ప్రభావం పడుతుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పవన్ కల్యాణ్ భేటీ
Last Updated : Feb 9, 2021, 10:47 PM IST