ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దిల్లీ చేరుకున్న జనసేన అధినేత పవన్ - భాజపా అగ్రనేతలతో పవన్ సమావేశం న్యూస్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దిల్లీ చేరుకున్నారు. భాజపా అగ్రనేతలతో సమావేశం కానున్న పవన్..విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Janasena chief Pawan Kalyan leaves for Delhi
దిల్లీ బయలుదేరిన జనసేన అధినేత పవన్

By

Published : Feb 8, 2021, 6:17 PM IST

Updated : Feb 9, 2021, 5:01 AM IST

విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించొద్దని భాజపా పెద్దలకు చెప్పడానికి దాని మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌లు సోమవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం మంచిదికాదని, రాజకీయంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని వీళ్లు భాజపా నేతలకు చెప్పాలనుకుంటున్నట్లు తెలిసింది. భాజపా అధ్యక్షుడు జేపీనడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌లను మంగళవారం కలిసి దీనిపై ఒక నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. విశాఖ స్టీల్‌ నేపథ్యం, దాని వెనకున్న ఉద్యమాలతోపాటు, ప్లాంట్‌ను లాభదాయకంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను కూడా కలిసి ఈ నివేదికను అందించే అవకాశం ఉన్నట్లు జనసేనవర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:

విశాఖ, ఏఎంఆర్డీయే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Last Updated : Feb 9, 2021, 5:01 AM IST

ABOUT THE AUTHOR

...view details