ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించండి:పవన్ - ఏపీలో ఇసుక కొరత

భవన నిర్మాణ కార్మికులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇసుక మాఫియాను అదుపు చేయకపోతే నిర్మాణ రంగం కుదేలవుతుందని అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

pawan kalyan
pawan kalyan

By

Published : May 31, 2020, 4:43 PM IST

భవన నిర్మాణ రంగ కార్మికులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక సరఫరా సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే..ఈ ప్రభుత్వమూ చేస్తోందని అన్నారు. ఇసుక మాఫియాను అదుపు చేయకపోతే నిర్మాణ రంగం కుదేలవుతుందని అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.

'ఇసుక ధరలతో మధ్యతరగతి వారు గృహ నిర్మాణం అంటే భయపడి వెనక్కి తగ్గుతున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ ఇసుక లారీలు వేలాదిగా తిరిగాయి... ఇసుక మాత్రం డంపింగ్ ప్రదేశాలకు చేరలేదు. ఆ ఇసుక అంతా ఎటు వెళ్లిపోయింది..? ఇసుక కొరత, కరోనాలతో పనులు దొరక్క కార్మికులు అల్లాడిపోతున్నారు' - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

ABOUT THE AUTHOR

...view details