ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎదిరించే వాళ్లు లేకపోతే.. వైకాపా దాష్టీకానికి అంతుండదు: పవన్ - జనసేన పార్టీ తాజా వార్తలు

వైకాపా ఓటేస్తే యాచకులుగా మారుస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులు పోటీ చేయకుండా వైకాపా దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపించారు.అర్హులైన వారికి ఫించన్లు, పథకాలు ఆపడం దుర్మార్గమన్నారు. ఎదిరించే వాళ్లు లేకపోతే వైకాపా దాష్టీకానికి అంతుండదని తెలిపారు.

జనసేన పవన్ కల్యాణ్
జనసేన పవన్ కల్యాణ్

By

Published : Mar 6, 2021, 7:51 PM IST

రాష్ట్రంలో మార్పు తెచ్చేందుకే భాజపాతో కలిశామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా వైకాపా దౌర్జన్యాలకు పాల్పడిందని విమర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు జన సైనికులు ఎదురు నిలిచారని కొనియాడారు. ఒత్తిళ్లు ఉన్నా జన సైనికులు ఎన్నికల్లో పోటీలో ఉన్నారని ప్రశంసించారు. మార్పు కోసమే యువత ధైర్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు.

పన్నుల సొమ్మును నచ్చిన పథకాల పేరుతో పంచుతున్నారని దుయ్యబట్టారు. అర్హులకు పింఛన్లు, పథకాలు ఆపడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించకపోతే దారుణాలు ఇలాగే కొనసాగుతాయన్న పవన్‌.. వైకాపాకు ఓటేస్తే ప్రజల్ని యాచకులుగా మారుస్తారని వ్యాఖ్యానించారు. పథకాలు తొలగిస్తామని బెదిరిస్తుంటే అధికారులేం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీకి లొంగకుండా ప్రజలకు న్యాయం చేయాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details