విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదందురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదని పవన్ ప్రశ్నించారు. ప్రమాదకర రసాయనాల నిల్వలో జాగ్రత్తలు తీసుకోరా అని నిలదీశారు. రక్షణ ఏర్పాట్లు బాగుంటే ప్రమాదం ఎలా జరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
విశాఖ ఫార్మాసిటీ ప్రమాదం దురదృష్టకరం: పవన్ కల్యాణ్ - janasena
విశాఖలో వరుస ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
janasena chief Pawan Kalyan