చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినుత కోటా ఇంటిపై దాడిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రశ్నించిన వారిపై అధికార గర్వంతో దాడులకు తెగబడటం, పోలీసులతో బాధితులపైనే కేసులు పెట్టించడమేమిటని ప్రశ్నించారు. దాడికి సంబంధించి వినుత కుటుంబంపైనే ఎదురు కేసు నమోదు చేయటంపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం అవుతోందన్నారు. చట్టప్రకారం పని చేయాల్సిన పోలీసులు వైకాపా నాయకులు చెప్పిన విధంగా పనిచేస్తే బాధితులకు న్యాయం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంలోనూ ఇదే నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల సూచనలతోనే కొందరు పోలీసు అధికారులు తమ నేతలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
జనసేన పార్టీ ఇంఛార్జ్ ఇంటిపై దాడి గర్హనీయం: పవన్ - జనసేన నేత వినుత కోటా ఇంటిపై దాడి తాజా వార్తలు
శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినుత కోటా ఇంటిపై దాడి గర్హనీయమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నించారు.
janasena chief pawan kalyan