ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PAWAN KALYAN: ఉద్యమాల్లోనే కాదు.. ఎన్నికలప్పుడూ బీసీలు ఏకం కావాలి: పవన్ కల్యాణ్ - ఏపీ వార్తలు

బీసీ ఉద్యమానికి మద్దతుగా తన వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan on bc movement news) అన్నారు. ఉద్యమించే సమయంలో బీసీలు ఒకటిగానే ఉంటున్నా.. ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని వ్యాఖ్యానించారు. వెనకబడిన కులాలకు రాజ్యాధికారం తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని అభిప్రాయపడ్డారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Oct 12, 2021, 5:53 PM IST

వెనకబడిన తరగతుల వారి హక్కుల కోసం ఉద్యమించే సమయంలో అంతా ఏకమవుతున్నారనీ, ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు (pawan kalyan on bc movement news). బీసీల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2024 ఎన్నికల సమయానికి బీసీలు స్పష్టమైన అజెండాతో ఉండాలన్నారు. హైదరాబాద్​లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి చెందిన పలువురు నాయకులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈనెల 23వ తేదీన హైదరాబాద్​లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించే జాతీయ స్థాయి సదస్సుకు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.

రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి కులగణన, రిజర్వేషన్ల కల్పనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్((pawan kalyan news) మాట్లాడుతూ.. బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమం తాలూకు భావవ్యాప్తికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆ కులాలకు స్వయం ప్రతిపత్తి, రాజ్యాధికారం తీసుకురావాలన్నదే తన ఆకాంక్షగా పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమం భావవ్యాప్తిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అభిలాషించారు. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నా అసలు సమయానికి ఆచరణకు నోచుకోవడం లేదని.. అందుకు రాజకీయపరమైన అవగాహన అవసరమన్నారు. ఇందుకు తగిన మథనం జరగాలన్నారు. యువతకు నాయకత్వాన్ని అప్పగించాలని.. రాజకీయంగా ముందుకు వెళ్లాలని.. బీసీ ఉద్యమానికి మద్దతుగా తన వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతానని పవన్​కల్యాణ్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details