ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన- భాజపా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు - ఏపీ తాజా వార్తలు

Janasena and BJP statewide protests: విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన- భాజపా సైతం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. పెంచిన ధరలు తక్షణం తగ్గించాలని ఆ పార్టీల శ్రేణులు ఎక్కడికక్కడ నిరసన తెలిపారు. ప్రజలపై ప్రభుత్వం పెనుభారం మోపుతోందంటూ భారీ ర్యాలీలు నిర్వహించారు.

Janasena and BJP statewide protests
విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన- భాజపా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

By

Published : Apr 1, 2022, 8:27 PM IST

Janasena and BJP statewide protests: పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ గుంటూరులో జనసేన చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. భాజపా కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగింది. విజయవాడ ధర్నాచౌక్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఛార్జీల బాదుడుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. పీపీఏలపై అవగాహనారాహిత్యమే 7 సార్లు చార్జీల పెంపుకు కారణమని ఆరోపించారు. విజయవాడలో పోతిన మహేశ్‌ ఆధ్వర్యంలో జనసేన ఆందోళన చేపట్టింది. మచిలీపట్నం, జగ్గయ్యపేటలో భాజపా, జనసేన ఆందోళనలు నిర్వహించాయి.

Janasena and BJP statewide protests: కాకినాడలో నిరసన ప్రదర్శనలో జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. ఏలూరులో జనసేన శ్రేణులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. చీరాలలో భాజపా శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. మార్కాపురంలో జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. నెల్లూరులోనూ జనసేన ఆందోళన నిర్వహించింది. కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద భాజపా నాయకులు ధర్నా చేశారు.

Janasena and BJP statewide protests: విశాఖలో జనసేన శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద బైఠాయించారు. ఛార్జీలు తగ్గించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎదుట భాజపా నాయకులు ఆందోళన నిర్వహించారు. విశాఖ జిల్లా పాడేరులో ర్యాలీ చేపట్టిన భాజపా నాయకులు... లాంతరు చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయనగరంలో జనసైనికులు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. భాజపా సైతం విజయనగరం కోట నుంచి గంటస్తంభం వరకు నిరసన ర్యాలీ చేపట్టింది. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జనసేన ఆందోళన చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

Janasena and BJP statewide protests: కర్నూలు రాజ్‌విహార్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు జనసేన నిరసన ప్రదర్శన నిర్వహించింది. అనంతపురంలో జనసేన శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ధర్మవరంలో విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద సీపీఐ నిర్వహించిన ధర్నాలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. గంటపాటు ఎండలో నిలబడి నిరసన తెలిపారు.

Janasena and BJP statewide protests: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జనసేన, భాజపా ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కలెక్టరేట్ల ముట్టడికి జనసేన, భాజపా శ్రేణులు యత్నించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన, భాజపా నేతలు నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: "ఐదేళ్ల అధికారం ముందు.. 30ఏళ్ల ప్రజాసేవ బానిసకావడం బాధాకరం"

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details