ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యే, సీఐ వేధిస్తున్నారని యువకుడి ఆత్మహత్యాయత్నం

ఇసుక అక్రమ రవాణాపై నిలదీసిన ఓ యువకుడు... రాజకీయ నేతలు, పోలీసుల వేధింపులతో తల్లడిల్లాడు. ప్రశ్నించిన పాపానికి కాళ్లు పట్టుకోమనడంతో... అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Janasena activist attempts suicide
Janasena activist attempts suicide

By

Published : May 22, 2020, 7:03 AM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వీకర్స్‌ కాలనీకి చెందిన లోకేష్‌ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, సీఐ ఆకుల రఘు వేధింపులే ఇందుకు కారణమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఏపీ నిట్‌లో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్న లోకేశ్‌... జనసేన కార్యకలాపాల్లోనూ పాల్గొంటుండేవాడు. స్థానికంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా విషయమై ప్రశ్నించడంతో... ఉద్యోగం తీయించేస్తామని ఎమ్మెల్యే, సీఐ బెదిరించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అలాగే కాళ్లు పట్టుకుంటే వదిలేస్తామని అన్నారని... ఇదంతా తట్టుకోలేక చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అనంతరం బుధవారం రాత్రి పట్టణ పోలీసు స్టేషన్‌ ఆవరణలో లోకేష్‌ పురుగుల మందుతాగాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

ఎమ్మెల్యే, సీఐ వేధిస్తున్నారని యువకుడి ఆత్మహత్యాయత్నం

అప్పట్నుంచే వేధింపులు:లోకేశ్

ఈ నెల 18న ప్రభుత్వ పాఠశాల వైపు వస్తున్న ఇసుక లారీని ఆపి... ఎక్కడికి వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పటినుంచి పోలీసు వేధింపులు మొదలయ్యాయి. చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న తనను... మానసికంగా వేధించారు. -సెల్ఫీ వీడియోలో లోకేశ్

ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ స్పందించారు. యువకుడిని ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించిన సీఐపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ప్రశ్నించినందువల్లే పోలీసులు వేధించారాని... ఇది నియంతృత్వాన్ని తలపిస్తోందని జనసేనాని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్‌, మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆసుపత్రిలో యువకుడిని పరామర్శించారు. ఇసుక దందాను నిలదీసిన యువకుడిని వేధించడం దారుణని... అందుకు కారణమైన ఎమ్మెల్యే, సీఐపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి.

ఇదీ చదవండి:

ఇసుక అక్రమాలను ప్రశ్నిస్తే వేధింపులా..?:పవన్

ABOUT THE AUTHOR

...view details