ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Saidabad incident: చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ - తెలంగాణ వార్తలు

సైదాబాద్‌లో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. సైదాబాద్‌లోని బాలిక ఇంట్లో... చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చనున్నారు.

Saidabad incident
Saidabad incident

By

Published : Sep 15, 2021, 2:36 PM IST

హైదరాబాద్ సైదాబాద్‌లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబసభ్యులను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. చిన్నారి ఇంటికి వెళ్లి.. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి.. వారిని ఓదార్చనున్నారు. సైదాబాద్‌కు పవన్ వెళ్లనున్నారు.

సైదాబాద్‌లో నిందితుడు రాజు చాక్లెట్ ఆశచూపి.. పాశవికంగా చిన్నారిని హత్యచేశాడు. అంతేకాకుండా శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్నిచోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి.. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది. అక్కడున్నవారు గుర్తుపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్కు, తువ్వాలు, ఒక జత దుస్తులతో కూడిన సంచిని ఇచ్చాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు బలం చేకూర్చుతూ అక్కడున్న సీసీ కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. కాగా నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగి.. ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

మత్తులో చిన్నారులను చిదిమేస్తున్న ఉన్మాదులు.. తెలంగాణలో పెరుగుతున్న పోక్సో కేసులు

ABOUT THE AUTHOR

...view details