హైదరాబాద్లో నేడు నీటి పారుదలతో పాటు పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ సదస్సు నిర్వహించనుంది, ఆంధ్రప్రదేశ్,. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులతో జరగనున్న సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం గురించి చర్చించనున్నారు. తమిళనాడులో తాగునీటి సమస్య, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల అంశంపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఇవాళ అధికారులు ప్రస్తావించనున్నారు.
కేంద్ర జలశక్తి శాఖతో దక్షిణాది రాష్ట్రాల సదస్సు - జలశక్తి శాఖతో దక్షిణాది రాష్ట్రాల సదస్సు
సాగు, తాగునీటితో పాటు పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్ర షెకావత్ హైదరాబాద్లో ఇవాళ ..దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులతో సదస్సు నిర్వహించనున్నారు.
కేంద్ర జలశక్తి శాఖతో దక్షిణాది రాష్ట్రాల సదస్సు