jal shakti ministry meeting: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు, సమస్యలపై చర్చించారు. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ దృశ్యమాధ్యమం ద్వారా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఏపీ సీఎస్ సమీర్ శర్మతో సమావేశమయ్యారు. రెండు బోర్డులకు నిర్వహణ కోసం ఒక్కో రాష్ట్రం నుంచి 200 కోట్ల చొప్పున సీడ్ మనీ ఇవ్వడం, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, సమాచారం ఇచ్చి బోర్డులకు స్వాధీనం చేసే అంశాలపై చర్చించారు.
jal shakti meet on krmb grmb gazette issue : అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడం, ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు విషయమై భేటీలో ప్రస్తావించారు. నోటిఫికేషన్ల అమలు దిశగా ఉన్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల నుంచి అందాల్సిన సహకారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
సీడ్ మనీని విడతల వారీగా చెల్లిస్తాం: ఏపీ అధికారులు
కృష్ణా, గోదావరి బోర్డులపై కేంద్ర జలశాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. బోర్డుల పరిధితో పాటు సీడ్ మనీ చెల్లింపు సహా.. వివిధ అంశాలను కేంద్ర జలాశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లారు. బోర్డులకు ఇవ్వాల్సిన సీడ్ మనీ రూ.200 కోట్లను విడతల వారిగా ఇస్తామని.. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ కు తెలిపింది. మూడు నెలలకు ఓ మారు చెల్లింపులు చేస్తామని ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన జలశక్తి శాఖ.. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం స్పందిస్తామని స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్.. తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేసింది.
బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను పక్కన పెట్టి.. తెలంగాణ నిర్ణయాలు తీసుకోవడం చట్ట వ్యతిరేకమైన చర్యగా ఏపీ పేర్కొంది. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం.. వివిధ ప్రాజక్టులకు కేంద్రం అనుమతి మంజూరు చేసినందున కొత్తగా డీపీఆర్‌లు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. గోదావరిపై తెలంగాణ.. అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఫిర్యాదు చేసింది. అయితే వివిధ అంశాలపై.. ఇరు రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు ఉండటంతో.. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉందని జలశక్తి శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు అజెండా అంశాలు సిద్ధం చేస్తే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిపి 3వ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:Search for diamonds in Nallamala Forest : వక్కిలేరు వాగులో...వజ్రాలకోసం వెతుకులాట...