ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

jal jeevan mission: ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌.. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు - ఇంటింటికీ కుళాయి కనెక్షన్

జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ఇప్పుడు పట్టణాల్లోనూ అమలు చేయనున్నారు. ప్రతీ ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చి ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు మార్గదర్శకాలు ఇచ్చింది.

jal jeevan mission
jal jeevan mission

By

Published : Oct 14, 2021, 8:35 AM IST

గ్రామాలకు పరిమితమైన జల జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కార్యక్రమాలను పట్టణాల్లోనూ అమలు చేయనున్నారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయడం, నీటి వనరుల సంరక్షణ, మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపేలా జేజేఎం లక్ష్యాలను రూపొందించారు. లక్ష జనాభా మించిన నగరాలు, పట్టణాల్లో అమృత్‌ పథకం అమలులో ఉన్నందున... లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో జేజేఎం కార్యక్రమాలు అమలుచేయాలని భావిస్తున్నారు.

కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు పంపింది. ఈ మేరకు ఐదేళ్లపాటు కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలి. రాష్ట్రంలోని లక్షలోపు జనాభాగల పట్టణాల్లో జేజేఎం అమలుకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ క్షేత్రస్థాయి అవసరాలపై పురపాలక సంఘాలు, నగర పంచాయతీల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ మేరకు త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.

ఇదీ చదవండి: DRUGS: విశాఖ కేంద్రంగా.. ద్రవరూపంలో గంజాయి తయారుచేస్తున్న ముఠాలు

ABOUT THE AUTHOR

...view details