గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ వేడుకలో జై అమరావతి నినాదాలు మారు మోగాయి. వేడుక ఏదైనా సరే.....అమరావతి వాసుల నినాదం ఒకటే.. అదే జై అమరావతి అంటూ.. అందరిలో నూతన ఉత్సాహాన్ని నింపారు అక్కడి మహిళలు, రైతులు. వారి నినాదాలకు వధూవరులు సైతం గొంతు కలిపారు. అమరావతి ఉద్యమానికి అక్కడున్నవారంతా ముక్త కంఠంతో మద్దతు పలికారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలు గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు - తుళ్లూరు వార్తలు
వేడుక ఏదైనా సరే... అమరావతి వాసుల నినాదం ఒక్కటే అదే జై అమరావతి. తుళ్లూరులో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ వేడుక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. అందరిలో ఉద్యమహోరు కనిపించింది. ఫ్లకార్డులు చేతపట్టి రైతులు, మహిళలతో పాటు వధూవరులు సైతం 'జై అమరావతి' అంటూ నినదించారు.
![జై అమరావతి అంటూ.. పెళ్లి వేడుకలో వధూవరుల నినాదాలు 'Jai Amravati' slogans at the wedding reception in tulluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10185363-590-10185363-1610242577836.jpg)
పెళ్లి రిసెప్షన్లో 'జై అమరావతి' నినాదాలు
పెళ్లి రిసెప్షన్లో 'జై అమరావతి' నినాదాలు
ఇదీ చదవండి: