ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - Jagan CBI Cases news

హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ 16కి వాయిదా పడింది. నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. విదేశాలకు వెళ్లేలా బెయిల్ షరతులు సడలించాలని నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై నిర్ణయం రేపటికి వాయిదా పడింది.

Jagan's anti-graft case is being heard in a CBI court in Hyderabad
Jagan's anti-graft case is being heard in a CBI court in Hyderabad

By

Published : Feb 9, 2021, 5:42 PM IST

హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా కేసులో అభియోగాల నమోదుపై విచారణ రేపటికి వాయిదా పడింది. రఘురాం సిమెంట్స్ కేసులో అభియోగాల నమోదుపైనా విచారణ రేపటికి వాయిదా పడింది. ఓబుళాపురం గనుల కేసు విచారణ 16కి వాయిదా పడింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ 16కి వాయిదా పడింది. విదేశాలకు వెళ్లేలా బెయిల్ షరతులు సడలించాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోరారు. నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై నిర్ణయం రేపటికి వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details