జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు యూనిఫార్మ్ లు అందించేందుకు 80 కోట్ల 43 లక్షల రూపాయల విడుదలకు ప్రభుత్వం పాలనా అనుమతులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి గాను ఈ రెండు తరగతుల విద్యార్థులకు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి యూనిఫార్మ్ జత కుట్టేందుకు 80 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర శిక్షణ పథకం కింద ఈ యూనిఫార్మ్ జతలను ప్రభుత్వం సరఫరా చేయనుంది.
'జగనన్న విద్యా కానుక' నిధుల విడుదలకు పాలనా అనుమతులు - జగనన్న విద్యా కానుక పథకం వార్తలు
జగనన్న విద్యా కానుక కింద రూ.80.43 కోట్లు విడుదలకు పాలనా అనుమతులిచ్చింది ప్రభుత్వం. ప్రతి యూనిఫార్మ్ జత కుట్టేందుకు రూ.80 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
jagananna vidya kanuka secheeme fund released