వచ్చే విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థి కిట్ల పంపిణీకి ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. 2021-22 విద్యా సంవత్సరంలో రూ.731 కోట్ల వ్యయంతో విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, బెల్టు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు అందిచాలని పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ఈసారి విద్యార్థులకు ఇచ్చే కిట్లలో ఒక నిఘంటువును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జగనన్న విద్యా కానుక: విద్యార్థులకిచ్చే కిట్లలో నిఘంటువు..! - Dictionary in Students Kits
జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థి కిట్ల పంపిణీకి ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ఈసారి విద్యార్థులకు ఇచ్చే కిట్లలో ఒక నిఘంటువును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వ, మండల పరిషత్, పురపాలక, రెసిడెన్షియల్, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తం 43 లక్షల 238 మంది విద్యార్థులకు ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం అమలు కోసం 500.62 కోట్ల రూపాయాల మేర రాష్ట్ర ప్రభుత్వం, 230.68 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం భరిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2021-22 విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేయాలని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండీ... రవీంద్ర అరెస్టు: మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం