'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం అక్టోబర్ 5కు వాయిదా పడింది. కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వెల్లడించారు. సెప్టెంబర్ 5న తలపెట్టిన కార్యక్రమం అక్టోబర్ 5కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ దృష్ట్యా కేంద్ర మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు తెరవకూడదని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది.
'జగనన్న విద్యా కానుక'.. అక్టోబర్ 5కు వాయిదా - జగనన్న విద్యా కానుక పథకం
జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా పడింది. సెప్టెంబర్ 5 న ప్రారంభించాలనుకున్న పథకం... అక్టోబర్ 5కు వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వెల్లడించారు.
jagananna vidya kaanuka