జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతీ విద్యార్థికి నాలుగు ధఫాల్లో పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ఏ త్రైమాసికానికి... ఆ త్రైమాసికంలోనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా నేడు 10లక్షల 88వేల 439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 671.45 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది.
జగనన్న విద్యాదీవెన: మొదటి విడత కార్యక్రమం నేడు ప్రారంభం - CM Jagan to launch Jagananna Vidya Deevena news
జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. 10లక్షల 88వేల 439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 671.45 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. అర్హత ఉన్న ప్రతీ విద్యార్థికి నాలుగు ధఫాల్లో పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రభుత్వం చెల్లిస్తోంది.
జగనన్న విద్యాదీవెన మొదటి విడత ఏప్రిల్ 19, రెండో విడత జులై, మూడో విడత డిసెంబర్, నాలుగో విడత ఫిబ్రవరి 2022లో ప్రభుత్వం విడుదల చేయనుంది. జగనన్న వసతిదీవెన కింద రెండు విడతల్లో భోజనం, వసతి, రవాణా సౌకర్యాలకు ఏటా 20,000 వరకు లబ్ధి చేకూర్చుతుంది. మొదటి విడత ఏప్రిల్ 28, రెండో విడత డిసెంబర్లో నిధులు చెల్లిస్తారు. ఈ ఏడాది మొదటి విడతగా 671.45 కోట్లు నేడు చెల్లించడం ద్వారా... 10 లక్షల 88వేల 439 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది.
ఇదీ చదవండీ... 'కన్న తల్లిలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకుంటాం'