ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగనన్న అమ్మఒడి లబ్ధిదారులు 41.46 లక్షలు - amma odi benefeciaries news

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి లబ్ధి దారుల సంఖ్య 41.46 లక్షలుగా తేలింది. వీరికి జనవరి 9న బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేలు జమ చేయనున్నారు. అయితే బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పుగా ఉండడం వల్ల 1.84 లక్షల మంది అనర్హులయ్యారు.

జగనన్న అమ్మఒడి లబ్ధిదారులు 41.46 లక్షలు
జగనన్న అమ్మఒడి లబ్ధిదారులు 41.46 లక్షలు

By

Published : Dec 29, 2019, 5:33 AM IST

జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య తుది జాబితా ఖరారైంది. రాష్ట్రంలో మొత్తం 41,46,844 మంది విద్యార్థులు తల్లులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. జనవరి 9 నుంచి వీరి బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి ఇంటర్​ వరకూ చదివే విద్యార్థులు 81.7 లక్షల మంది ఉండగా అందులో 65.1 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. విద్యార్థుల వివరాలను తల్లుల ఆధార్​, రేషన్​ కార్డులతో అనుసంధానం చేసి 41.46 లక్షల మంది లబ్ధిదారులతో తుది జాబితా రూపొందించారు.

ఖాతాల్లో పేర్లు తప్పులు.. అనర్హులు

బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పుగా ఉండడం వల్ల 1.84 లక్షల మంది అనర్హులయ్యారు. 14.7 లక్షల మందిని వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారు. ఇందులో ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్లు ఉండడం, తల్లి, విద్యార్థుల ఆధార్​ తప్పుగా ఉండడం, సర్కారు నిర్ణయించినదానికన్నా ఎక్కువ స్థిరాస్తి ఉండడం, పథకం వద్దని చెప్పిన వారూ ఉన్నారు.

ఇదీ చూడండి:

'తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయాలి'

ABOUT THE AUTHOR

...view details