ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారత హాకీ జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకోవటం గర్వకారణం - పురుషుల హాకీ జట్టు

భారత పురుషుల హాకీ జట్టుకు సీఎం జగన్ , తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. సుధీర్ఘకాలం తర్వాత భారత హాకీ.. పూర్వ వైభవాన్ని గుర్తుచేసిందని సీఎం కొనియాడారు.

JAGAN WISHES TO INDIAN MEN HOCKEY TEAM
భారత పురుషుల హాకీ జట్టుకు సీఎం జగన్ అభినందనలు

By

Published : Aug 5, 2021, 11:17 AM IST

Updated : Aug 5, 2021, 2:07 PM IST

భారత పురుషుల హాకీ జట్టుకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు.. చరిత్ర సృష్టించిందని సంతోషం వ్యక్తం చేశారు. యువతకు స్ఫూర్తి కలిగించే విజయమని కొనియాడారు. సుధీర్ఘకాలం తర్వాత భారత హాకీ.. పూర్వ వైభవాన్ని గుర్తుచేసిందని అన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుకు.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... అభినందనలు తెలిపారు. భారత హాకీ జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకోవటం గర్వకారణమని.. చంద్రబాబు అన్నారు.

హాకీ జట్టు.. పతకం సాధించటం.. 'చెక్ దే' క్షణాలను గుర్తు చేసిందని... లోకేశ్ పేర్కొన్నారు. 41 ఏళ్ల తర్వాత హాకీ క్రీడలో దేశానికి పతకం రావటం సంతోషకరమని బాలకృష్ణ అన్నారు

ఇదీ చూడండి.

తీరిన 41 ఏళ్ల కల.. టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు కాంస్యం

Last Updated : Aug 5, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details