రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పథకాన్ని కృష్ణా జిల్లాలోని పునాదిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. పాఠశాలలో 'నాడు-నేడు' పనులను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ పథకం ద్వారా ఏపీలోని 42 లక్షల 34 వేల 322 మంది విద్యార్థులకు దాదాపు 650 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం.. స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయనుంది. అన్నిప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీవీబీ, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు.. స్డూడెంట్ కిట్లు పంపిణీ చేస్తారు. ఇప్పటికే కిట్లను ఆయా పాఠశాలలకు పంపామన్నారు. కిట్‌లో ఒక్కో విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు ఉంటాయి. 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్.. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇస్తామని వెల్లడించారు.