అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరు కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను.
'అయోధ్య తీర్పుపై సంయమనం పాటించాలి' - అయోధ్య తీర్పుపై ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు న్యూస్
అయోధ్య వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ప్రజలెవరూ మత సామరస్యానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని.. ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు.
అయోధ్య తీర్పు నేపథ్యంలో సంయమనం పాటించాలి
Last Updated : Nov 9, 2019, 1:10 PM IST