ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్ - ap job calender news

రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాఖల వారీగా ఖాళీల నివేదికను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. నేడు సీఎం జగన్ ఉద్యోగ క్యాలెండర్​ను విడుదల చేయనున్నారు.

నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్
నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్

By

Published : Jun 17, 2021, 10:51 PM IST

Updated : Jun 18, 2021, 3:13 AM IST

నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్


రాష్ట్రంలో శాఖల వారీగా ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన సమాచారంపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి.. ఉదయం 11 గంటలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. ఉద్యోగాలను గ్రూప్‌ 1, 2, 3, 4 కేటగిరీలుగావిభజన చేసి భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ ఆమోదంతో విడతల వారీగా.. ఆయా కొలువుల భర్తీకి ఎపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ అన్నీ కలిపి 10 వేల 143 కొలువుల భర్తీకి సన్నద్ధమైన సర్కార్‌ విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో జూలైలో 1,238 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా 36 పోస్టులకు ప్రకటన జారీ చేస్తామని పేర్కొంది. పోలీస్‌ శాఖలో 450 పోస్టులకు సెప్టెంబరులో 451 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు అక్టోబరులో ప్రకటన వస్తుందని తెలిపింది. ఇక నవంబర్‌లో అత్యధికంగా 5,251 మంది పారామెడికల్‌ సిబ్బంది, డిసెంబరులో–441 మంది నర్సుల నియామకానికి ప్రకటన వస్తుందని వెల్లడించింది. ఇక 2022 జనవరిలో 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టులకు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధించి ఫిబ్రవరిలో 2 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపింది. మార్చిలో.. వేర్వురు శాఖల ద్వారా మరో 36 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని వెల్లడించింది.

జూలై–2021 1,238 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్టులు
ఆగస్టు–2021 36 ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టులు
సెప్టెంబరు–2021 పోలీస్‌ శాఖలో 450 కొలువులు
అక్టోబరు–2021 451 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు
నవంబరు–2021 5,251 పారామెడికల్‌ పోస్టులు
డిసెంబరు–2021 441 నర్సు పోస్టులు
జనవరి–2022 240 డిగ్రీ కాలేజీల లెక్చరర్ల పోస్టులు
ఫిబ్రవరి–2022 వర్సిటీల్లో 2,000 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
మార్చి–2022 ఇతర శాఖల్లో 36 పోస్టులు
Last Updated : Jun 18, 2021, 3:13 AM IST

ABOUT THE AUTHOR

...view details