జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక నిందితుడని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Lokesh) ఆరోపించారు. ఆయన చేసిన రూ.43వేల కోట్ల మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో మోసాల ముందు రాష్ట్రంలో జరిగిన ఇతర కుంభకోణాలన్నీ చిన్నవేనని దుయ్యబట్టారు. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి తీరుందని మండిపడ్డారు.
Lokesh: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నిందితుడు జగన్మోహన్ రెడ్డి: లోకేశ్ - Lokesh comments on Jagan
సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్(Lokesh) హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆఫ్ షోర్ కంపెనీలు, పెట్టుబడిదారుల సామ్రాజ్యాన్ని ఏ1 జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తే... క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ ప్రక్రియ ఏ2 నిర్వర్తించారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
ఆఫ్ షోర్ కంపెనీలు, పెట్టుబడిదారుల సామ్రాజ్యాన్ని ఏ1 జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తే... క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ ప్రక్రియ ఏ2 నిర్వర్తించారు. 43వేల కోట్ల కుంభకోణం ద్వారా దక్షిణ భారత విజయమాల్యాగా పేరొందిన జగన్మోహన్ రెడ్డి... 3 రాష్ట్రాల్లో రూ.6వేల కోట్లు విలువ చేసే ప్యాలెస్లు కట్టుకున్నారు. సండూరు పవర్, సరస్వతి పవర్, భారతి సిమెంట్, పులివెందుల పాలిమర్స్, ఫారెస్ట్ ప్లాంటేషన్స్ వంటి అనేక సంస్థలు జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనకు ఉపయోగపడ్డాయి.-నారా లోకేశ్
ఇదీ చదవండీ... 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్పై.. విచారణ వాయిదా