జగతి పబ్లికేషన్స్‌లో ముగ్గురు వ్యాపారుల నుంచి మోసపూరితంగా పెట్టుబడులు పెట్టించారన్న కేసు నుంచి తనను తొలగించాలని సీఎం జగన్ సీబీఐ న్యాయస్థానాన్ని కోరారు. డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదించారు. పెట్టుబడులు కంపెనీ చట్టాలకు అనుగుణంగా.. వ్యాపార కోణంలోనే జరిగాయని.. ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించారు. తదుపరి విచారణ నేటికి వాయిదా పడింది.
జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌తో పాటు.. ఈడీ కేసులు ముందుగా విచారణ జరపాలన్న పిటిషన్లపై బుధవారం విచారణ జరగనుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ.. నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఓఎంసీ కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ వాయిదా వేయాలని గనుల శాఖ మాజీ సంచాలకుడు, నిందితుడు వీడీ రాజగోపాల్ పిటిషన్ దాఖలు చేశారు.