సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణ నవంబరు 2కు వాయిదా పడింది. ముందు తమ కేసుల విచారణ చేపట్టాలన్న ఈడీ అభ్యర్థనపై వాదనలు కొనసాగాయి. సీబీఐ కేసు తేలిన తర్వాత లేదా ఒకేసారి విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈడీ కేసులు ముందుగా విచారణ జరపవద్దని జగన్తో పాటు విజయ సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ తరఫున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈడీ వాదనల కోసం విచారణ నవంబరు 2కు వాయిదా వేయగా... ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసు విచారణ నవంబరు 3కు వాయిదా వేసింది.
జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా - ed cases on jagan
సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణ నవంబరు 2కు వాయిదా పడింది. సీబీఐ కేసు తేలిన తర్వాత.. లేదా ఒకేసారి విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
cm jagan