జగన్(CM JAGAN) అక్రమాస్తుల కేసుల్లోని పెన్నా ఛార్జిషీట్ నుంచి గనుల శాఖ విశ్రాంత సంచాలకుడు రాజగోపాల్‌ను తొలగించవద్దని కోర్టును సీబీఐ (CBI) కోరింది. తనను కేసు నుంచి తొలగించాలని కోరుతూ రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి (IAS OFFICER) ఎం.శామ్యూల్, పీఆర్ ఎనర్జీ సంస్థ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. పెన్నా గ్రూప్ నకు చెందిన పయనీర్ హాలిడే రిసార్ట్స్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను సాంకేతిక కారణాలతో వెనక్కి పంపించింది. పెన్నా ఛార్జిషీట్‌పై విచారణను సీబీఐ కోర్టు జులై 6 కు వాయిదా వేసింది.
CBI:పెన్నా ఛార్జిషీట్ విచారణ జులై 6 కు వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసులు
పెన్నా కేసు నుంచి రాజగోపాల్‌ను తొలగించొద్దని సీబీఐ కోర్టును.. కేంద్ర దర్యాప్తు సంస్థ కోరింది. ఈ మేరకు రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్ (discharge petition)పై సీబీఐ(CBI).. కౌంటరు దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ ఛార్జీ షీట్‌పై విచారణను కోర్టు.. జులై 6కు వాయిదా వేసింది.
పెన్నా ఛార్జిషీట్ విచారణ జులై 6 కు వాయిదా