ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు : ఎంపీ రఘురామ పిటిషన్​పై నేడు విచారణ - MP Raghu Rama petition to be heard News

అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్​పై నేడు విచారణ జరగనుంది. పిటిషన్​ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో ఆదేశించింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.

ఎంపీ రఘురామ పిటిషన్​పై ఇవాళ విచారణ
ఎంపీ రఘురామ పిటిషన్​పై ఇవాళ విచారణ

By

Published : May 26, 2021, 1:52 AM IST

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. షరతులు ఉల్లంఘించినందున.. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్​లో రఘురామకృష్ణరాజు కోరారు.

చివరి అవకాశంగా నేటికి వాయిదా..

పిటిషన్​ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఈనెల 7న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు. ఈనెల 17న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. పదేపదే గడువు కోరడంపై రఘురామ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపిన న్యాయస్థానం.. విచారణను నేటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండీ...టైమ్స్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఇందూ జైన్‌కు సీఎం జగన్ నివాళి

ABOUT THE AUTHOR

...view details