శాసన మండలి నిర్మాణం పట్ల, కూర్పు పట్ల నాకు గౌరవం ఉందని మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో స్పష్టం చేశారు. శాసనసభ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. లోటుపాట్లను చర్చించి సూచనలు, సలహాలు ఇవ్వడమే మండలి ఉద్దేశమన్నారు. అయితే.. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరడంలేదని అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కీర్తి ప్రతిష్ఠలు పెరగకూడదనే ఉద్దేశంతోనే తెదేపా నేతలు బిల్లులకు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం తీసుకుంటున్న ప్రజాయోగ్యమైన నిర్ణయాలను ఆచరణలో పెట్టకుండా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మేమంతా ముఖ్యమంత్రి వెంటే ఉంటామన్నారు. శాసనమండలిపై చంద్రబాబు అప్పుడొక మాట, ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల వల్ల అమరావతికి ఎలాంటి నష్టం జరగదన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో రూపొందించిన బిల్లులను అడ్డుకుంటున్న శాసనమండలి కొనసాగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
'జగన్ కీర్తి ప్రతిష్ఠలు పెరగకూడదనే అడ్డంకులు' - పేర్నినాని కామెంట్స్
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షనేతలు అడ్డుకుంటున్నారని మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. సీఎం తీసుకుంటున్న ప్రజాయోగ్యమైన నిర్ణయాలను ఆచరణలో పెట్టకుండా అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
మంత్రి పేర్నినాని