తితిదే నూతన పాలకమండలి ఏర్పాటుపై ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. సీఎం ఎవరైనా... తితిదే బోర్డు నియామకాలు రాజకీయంగానే జరుగుతుంటాయని తెలిపారు. ఏంచేసినా అడిగేవారు లేరన్నట్లుగా.. జగన్ ప్రభుత్వంలో నియామకాలు చేపడుతున్నారని ఐవైఆర్ మండిపడ్డారు. హైందవ ధర్మసంస్థల్లో ఇష్టమొచ్చినట్లు నియామకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంతా మేల్కొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు.
IYR KRISHNARAO: 'తితిదే బోర్డు నియామకాల్లో రాజకీయాలు..!' - ap latest news
తితిదే బోర్డు నియామకాలు ఎప్పుడూ రాజకీయంగానే జరుగుతుంటాయని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఏం చేసినా అడిగేవారు లేరనే ఉద్దేశంతోనే... నియామకాలు చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.
'తితిదే బోర్డు నియామకాల్లో రాజకీయాలు..!'