ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో 'ఆ' నిబంధనను ఇప్పుడే ఎందుకు మార్చారు.. ?: ఐవైఆర్ - తిరుమలలో డిక్లరేషన్ వివాదం వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు... అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదని తితిదే నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. డిక్లరేషన్ నిబంధన ఎన్నో సంవత్సరాలుగా ఉందన్నారు. ఇప్పుడు ఎందుకు మార్చారో చెప్పాలని ప్రశ్నించారు.

former chief secretary iyr krishna rao
former chief secretary iyr krishna rao

By

Published : Sep 19, 2020, 10:37 AM IST

Updated : Sep 19, 2020, 12:58 PM IST

తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అవసరం లేదన్న తితిదే నిర్ణయంపై.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుుస్పందించారు . ఇప్పటికిప్పుడు నిబంధనను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తితిదే ఛైర్మన్ చెప్పాలని ప్రశ్నించారు. డిక్లరేషన్ నిబంధన ఇవాళ్టిది కాదని... ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదని పేర్కొన్నారు.

ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శనానికి వచ్చినప్పుడు నాటి కార్యనిర్వహణాధికారి డిక్లరేషన్ కోసం గట్టిగా పట్టుబట్టారని గుర్తు చేశారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదన్నారు. అవసరమైతే... ఆ కార్యక్రమాన్ని దేవాదాయశాఖ మంత్రి నిర్వహించవచ్చని ట్వీట్ చేశారు.

Last Updated : Sep 19, 2020, 12:58 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details