పింఛను చెల్లింపు ఆలస్యంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈనెల పింఛను వారం ఆలస్యంగా ఇవాళ వచ్చిందని ట్వీట్ చేశారు. బడ్జెట్‌లో మొదటి కేటాయింపులు.. జీతాలు, పింఛన్లే అని ఐవైఆర్ వివరించారు. అవే వారం ఆలస్యం అయ్యాయంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం అవుతుందని పేర్కొన్నారు. ఆదాయానికి, వ్యయానికి పొంతన లేకుండా ముందుకెళ్లే రాష్ట్రానికి భంగపాటు తప్పదని ఐవైఆర్ హెచ్చరించారు.
'ఆదాయానికి, వ్యయానికి పొంతన లేకుంటే భంగపాటు తప్పదు' - ఐవైఆర్ కృష్ణారావు తాజా వార్తలు
ఆదాయానికి, వ్యయానికి పొంతన లేకుండా ముందుకెళ్లే రాష్ట్రానికి భంగపాటు తప్పదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. రాష్ట్రంలో పింఛను చెల్లింపు ఆలస్యంపై కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు