IT searches in Hyderabad హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ (ఆదాయపు పన్ను శాఖ) దాడులు చేస్తోంది. నగరంలోని ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌ఎస్.బ్రదర్స్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంస్థ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏకకాలంలో 15కు పైగా ఐటీ బృందాల తనిఖీలు చేపట్టారు. నిన్నటి వరకు రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం సృష్టించాయి. ఇప్పుడు తాజాగా ఐటీ కూడా రంగంలోకి దిగింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
IT searches: ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు - IT ED CBI SEARCHES IN HYD
గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా వివిధ చోట్ల ఐటీ దాడులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఐటీ శాఖ సోదాలను జరపడం రోజు చూస్తున్నాం. తెలంగాణాలోని హైదరాబాద్ నగరంలోని ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌ఎస్.బ్రదర్స్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడులకు కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు