హైదరాబాద్: యశోద ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను అధికారుల తనిఖీలు - యశధ ఆస్పత్రిలో ఐటీ సోదాలు తాజా వార్తలు
11:27 December 22
ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ ఐటీశాఖ సోదాలు
హైదరాబాద్ యశోద ఆస్పత్రుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీశాఖ సోదాలు కొనసాగుతున్నాయి. 20కి పైగా బృందాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలువురు వైద్యుల ఆదాయ పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు..పలు పత్రాలు స్వాధీనం