ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రత్యేక జౌళి విధానం తీసుకువస్తాం: మంత్రి గౌతమ్ రెడ్డి

రాష్ట్రంలో ప్రత్యేక జౌళి విధానం తీసుకువచ్చే యోచనలో ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. దిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తే రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

it minister gowtham reddy
it minister gowtham reddy

By

Published : Mar 17, 2021, 4:31 PM IST

ఏపీలో ప్రత్యేక జౌళి విధానం తీసుకురావాలనే యోచనలో ఉన్నామని ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. దిల్లీ వేదికగా జౌళిశాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో జౌళి పెట్టుబడులకు గల అవకాశాలు వివరించామని ఆయన తెలిపారు. ఈ విషయంపై సీఎం జగన్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాయుధ బలగాల్లో దుస్తుల అవసరాలను చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ తెలిపారని వివరించారు. టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో పెట్టుబడులకు ఆహ్వానించామని... ముందుకువచ్చే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

'పెట్రో కెమికల్ కారిడార్‌లో పెట్టుబడులకు అవకాశాలను వివరించాం. ఏపీని పెట్రో కెమికల్స్ ఆధారిత తయారీ హబ్‌గా మారుస్తాం. ఆర్థిక వృద్ధిరేటులోనే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో ఏపీ ముందుంది. పెట్రో కెమికల్ రంగంలో రాష్ట్రం ఎదగడానికి అవకాశం ఉంది. 3 జాతీయస్థాయి పారిశ్రామిక కారిడార్లున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను కలుపుతూ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తాం. వివిధ పెట్రో కెమికల్ కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నాం' - పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details