నిరంతర విద్యుత్ సరఫరా, నీరు, మౌలిక సదుపాయాలు లేకుండా పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానించలేమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. తైవాన్ కు చెందిన సెమీ కండక్టర్, మొబైల్ పరికరాల తయారీ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి తెలిపారు. తైవాన్ పరిశ్రమకు పుష్కలంగా నీటి అవసరం ఉంటుందన్నారు. నీటి సరఫరా ఏర్పాట్లు పూర్తి చేసేంతవరకూ పెట్టుబడులను కోరటం ఇబ్బంది కరంగానే ఉంటుందని తెలిపారు.
మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో తైవాన్ దేశానికి చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. తైవాన్ కల్చరల్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ సహా వివిధ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు.