కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. చమురు ఆధారిత పెట్రో కెమికల్ పరిశ్రమలకు ఏపీ అనుకూలమైన ప్రదేశమని పేర్కొన్నారు. ముంబయిలో జరుగుతున్న గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్ సదస్సుకు హాజరైన మంత్రి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పారిశ్రామిక వేత్తలు, పెట్రో కెమికల్ పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు. సహజ నిక్షేపాలున్న ఏపీలో పెట్టుబడులు, వృద్ధికి అన్ని రాష్ట్రాలకూ ఆహ్వానం పలుకుతున్నామని గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ అంతా పెట్రో కెమికల్ కారిడార్లదేనని.. కేంద్ర ఆర్థిక లక్ష్యంలో ఏపీ వాటా పెంచాలన్నదే తమ అభిప్రాయమని మంత్రి తెలిపారు.
'కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఏపీ కృషి చేస్తుంది' - ముంబయిలో గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్ సదస్సు న్యూస్
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఏపీ.. తన వంతు కృషి చేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా-గోదావరిలో బేసిన్లో అపారమైన చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.
'కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఏపీ కృషి చేస్తుంది'