ఏ పరిశ్రమ స్థాపించాలన్నా నైపుణ్యం కలిగిన యువత అవసరమని ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి అంశంపై ఆయన సమీక్షించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోని యువత నైపుణ్యంపై ఆరా తీస్తారని చెప్పారు. స్థానిక యువతకు నైపుణ్యాలు అందించి వర్క్ ఫోర్స్ తయారీపై దృష్టి పెట్టామన్నారు.
ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో మార్పులకు తగ్గట్లు శిక్షణపై దృష్టి సారించామని వివరించారు. శిక్షణ తర్వాత ఎలాంటి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నామనేదే ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అనే చట్టం తెచ్చిందని.. ఏపీఎస్ఎస్డీసీ సహకారంతో ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే దానిపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.