ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగి ఉండేలా... సీఎం జగన్ కలలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరించారు. జాతీయస్థాయి అప్రెంటిస్‌షిప్ అభివృద్ధి పథకానికి సంబంధించి విజయవాడలోని ఓ హాటల్లో నిర్వహించిన కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు. పారిశ్రామిక వర్గాలకు అనుగుణంగా, నైపుణ్యాలను అందించేలా త్వరలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలు, కళాశాలలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధించే నైపుణ్యాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు.
'నైపుణ్యాభివృద్ధి పెంపొందించే దిశగా కార్యక్రమాలు' - skill development centers in ap news
రాష్ట్ర విద్యార్థులు ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగి ఉండేలా తగిన కార్యక్రమాలు చేపడతామని... మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.
it minister gowtham reddy participated in national apprenticeship development program at vijayawada