శాసనసభను నిర్వహించేది ప్రజాసమస్యల పరిష్కారానికా లేక తనను అవమానపరచడానికా అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. 40 ఏళ్ల అనుభవం అంటూ పదేపదే తనను ఎగతాళి చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిని 40 నిమిషాల పాటు శాసనసభ గేటు బయట నిలబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇవన్నీ వైకాపా చేస్తున్న కుట్రలని ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా, నిందలైనా భరిస్తానన్నారు. పేదల అజెండా వదిలేసి ప్రతిపక్షాన్ని అణిచివేయటమే అజెండాగా పెట్టుకున్న వైకాపాకి పతనమేనని హెచ్చరించారు. చిత్తశుద్ధి ఉంటే జీవో 2430 రద్దు చేసి, అసెంబ్లీ ప్రసారాలకు 3 ఛానళ్లపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని హితవు పలికారు. ప్రజాపక్షమైన తెదేపాను సభలోకి రానివ్వకుండా అడ్డుకోవడం... ప్రజాస్వామ్యంలో చీకటి రోజని అభివర్ణించారు. నిజం చెప్పే మీడియా అన్నా, ప్రభుత్వ తప్పులను నిగ్గదీసే తెదేపా అన్నా వైకాపాకి భయమని ధ్వజమెత్తారు. అందుకే మార్షల్స్‌తో బలప్రయోగాలు చేయడం, ప్రతిపక్షం గొంతునొక్కడాలు చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు: చంద్రబాబు - ఏపీ శాసనసభ సమావేశాలు
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడిని 40 నిమిషాల పాటు శాసనసభ గేటు బయట నిలబెట్టడం ఏంటని ప్రశ్నించారు. పేదల అజెండా వదిలేసి ప్రతిపక్షాన్ని అణిచివేయటమే అజెండాగా పెట్టుకున్న వైకాపాకి పతనమేనని ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.
అసెంబ్లీ వద్ద తెదేపా నేతలను అడ్డుకున్న మార్షల్స్