ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్​ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.65లక్షలు స్వాధీనం - హైదరాబాద్ తాజా​ వార్తలు

ఐటీ సోదాలు అంటే ఏ సినీ నటుడి ఇంట్లోనో, వ్యాపారవేత్త ఇంట్లోనో, రాజకీయ నాయకుడి ఇంట్లోనో జరుగుతాయి. కానీ.. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్​ఎంపీ వైద్యుడి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. అతడి ఇంట్లో సుమారు రూ.65 లక్షలు లభించినట్లు తెలుస్తోంది.

it and police rides in rmp doctor house at husnabad in siddipeta district
ఆర్​ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు.. రూ.65లక్షలు స్వాధీనం

By

Published : Mar 6, 2021, 5:48 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నివాసం ఉంటున్న ఆర్ఎంపి వైద్యుడు కొడమల్లు ఆంజనేయులు ఇంట్లో టాస్క్ ఫోర్స్, ఐటీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. సుమారు 65 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు కనుగొన్నారు.

డబ్బులు లెక్కించే మిషన్లు

డబ్బులు లెక్కించే మిషన్లను ఇంట్లోకి తీసుకెళ్లి లెక్కిస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో ఆరా తీస్తున్నారు. కొడమల్లు ఇంట్లో ఐటీ, పోలీసులు సోదాలతో స్థానికంగా కలకలం రేగింది.

ABOUT THE AUTHOR

...view details