పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి ప్రత్యేక ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక గదిని ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదోతరగతి పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
పాటించాల్సిన జాగ్రత్తలివి:
* విద్యార్థులు, తల్లిదండ్రులు గుంపులుగా గుమిగూడకూడదు.
* విద్యార్థులు, సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్
* జిగ్‌జాగ్ నమూనాలో కూర్చునేలా ఏర్పాట్లు.
* ఇద్దరి మధ్య దూరం ఐదు అడుగులు ఉండాలి.