Singareni: సింగరేణిలోని భూగర్భ గనుల్లో స్ట్రాటా కంట్రోల్, వెంటిలేషన్, ఓపెన్ కాస్టు గనుల్లో ఓబీ వాలుతలాల స్థిరీకరణ, బ్లాస్టింగ్ పద్ధతులపై పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విస్తృత పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ పరిశోధనల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించటంతో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ విభాగం ‘ఐఎస్‌వో 9001:2015’ ధ్రువపత్రాన్ని పొందింది. ఈ సందర్భంగా విభాగం డీజీఎం డీఎం సుభానీ మాట్లాడారు. ధ్రువపత్రం పొందటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Singareni: సింగరేణి ఆర్‌అండ్‌డీకి...అంతర్జాతీయ ప్రమాణాల ధ్రువపత్రం - హైదరాబాద్ తాజా వార్తలు
Singareni: తెలంగాణ సింగరేణిలోని పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగానికి అంతర్జాతీయ ప్రమాణాల ధ్రువపత్రం లభించింది. ఆధునిక మైనింగ్ పద్ధతులను అమలు చేసే క్రమంలో ఓపెన్‌కాస్ట్, భూగర్భ గనుల్లో పలు అంశాలపై సొంతంగా పరిశోధనలు నిర్వహిస్తోంది.
తమ విభాగం తొలిసారిగా మణుగూరు ఏరియాలోని పగిడేరు వద్ద జియో థర్మల్ పవర్ ప్లాంటు (భూగర్భం నుంచి ఉబికి వస్తున్న వేడి నీటితో విద్యుత్తు ఉత్పత్తి)ను ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. బొగ్గు నుంచి మిథనాల్ తయారు చేసే మోడల్ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. తమ పరిశోధనలతో సంస్థకు సుమారు రూ.3.89 కోట్లు ఆదా చేశామన్నారు. అంతర్జాతీయ బొగ్గు గని పరిశోధనాసంస్థలకు తీసిపోని విధంగా తాము పరిశోధనలు చేస్తున్నట్లు డీజీఎం డీఎం సుభానీ వివరించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందినందుకు సిబ్బందిని సంస్థ ఛైర్మన్ ఎన్.శ్రీధర్ అభినందించారు.
ఇదీ చదవండి: Tension at Kuppam: పార్థసారథి అంత్యక్రియలకు భారీగా నేతలు.. కుప్పంలో ఉద్రిక్తత