'అధిక ధరలకు విద్యుత్ కొనటం దుర్మార్గం కాదా?' - అవగాహన రాహిత్యం
వైకాపా ప్రభుత్వ అవగాహన రాహిత్యం కారణంగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
పీపీఏలపై దుష్ప్రచారం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సౌర, పవన్ విద్యుత్ రూ.3 నుంచి రూ.4.84లకే వస్తుంటే శ్రద్ధ పెట్టకుండా... ఇప్పుడు యూనిట్ రూ.11.68కి కొనడం దుర్మార్గపు చర్య కాదా? అని మండిపడ్డారు. మహానది కోల్ మైన్స్‌లో టన్ను బొగ్గు ధర రూ.1,600 ఉండగా... సింగరేణిలో టన్నును రూ.3,700కు కొనడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆర్థికభారం కలిగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ముందుజాగ్రత్తగా బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సిన అవగాహన లేకుండా, విద్యుత్ కొరతతో గ్రామాలను, ప్రజలను అంధకారంలోకి నెట్టారని పేర్కొన్నారు.