ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ సానుభూతిపరుడి అరెస్ట్ - ISIS Sympathizer Arrested in Oldcity

ISIS Sympathizer Arrested: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఫలక్​నూమలో ఐసిస్ సానుభూతిపరుడిని ఆ రాష్ట్ర సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షిస్తూ పోస్టులు పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ISIS Sympathizer Arrested
ISIS Sympathizer Arrested

By

Published : Apr 2, 2022, 8:38 PM IST

ISIS Sympathizer Arrested: ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ పేరుతో ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని తెలంగాణ రాజధాని హైదరాబాద్ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తీ ఫలక్‌నూమ ప్రాంతానికి చెందిన సులేమాన్ సామాజిక మాధ్యమాల్లో ఐసిస్‌ పేరుతో యువతను తీవ్రవాదం వైపు ఆకర్షిస్తూ పోస్టులు పెడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలోనే ఇతను పలు మార్లు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఐపీ అడ్రస్ ఆధారంగా అతన్ని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సులేమాన్‌ను రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details