ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ - ips transfers in ap

ips-transfers-in-ap
ips-transfers-in-ap

By

Published : Mar 6, 2020, 11:05 AM IST

Updated : Mar 6, 2020, 11:40 AM IST

10:55 March 06

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది.  పోలీసు నియామకబోర్డు ఛైర్మన్‌గా హరీశ్‌కుమార్ గుప్తాను నియమించింది.  విశాపట్నం అదనపు డీజీగా ఆర్‌.కె. మీనాకు పదోన్నతి లభించింది. డీజీపీ కార్యాలయంలో న్యాయవిభాగం ఐజీగా బి.హరికుమార్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. ఎస్​ఐబీ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌ నియామకమయ్యారు. మెరైన్‌ విభాగం ఐజీగా ఎఎస్ ఖాన్‌ నియామకం కాగా...  గుంటూరు రేంజ్‌ ఐజీగా జె.ప్రభాకర్‌రావు బదిలీ అయ్యారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌ ఐజీగా నియమితులైన వినీత్‌ బ్రిజ్‌లాల్‌...  ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా అదనపు  బాధ్యతలు చేపట్టనున్నారు. ఇసుక అక్రమ రవాణా, మైనింగ్‌ పర్యవేక్షణాధికారిగా సురేంద్రబాబును ప్రభుత్వ నియమించింది. 

డీజీపీ కార్యాలయంలో... పీ అండ్‌ ఎల్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌ను నియమించగా... డీఐజీ ఇంటెలిజెన్స్‌గా కొల్లి రఘురాంరెడ్డి బదిలీ అయ్యారు.  అనిశా అదనపు డైరెక్టర్‌గా  జీవీజీ అశోక్‌ కుమార్,  ఇంటెలిజెన్స్‌ డీఐజీగా  విజయ్‌ కుమార్‌ , సీఐడీ డీఐజీ హరికృష్ణ, డీజీపీ కార్యాలయంలో ఎల్‌ అండ్‌వోగా రాజశేఖర్‌బాబును ప్రభుత్వం నియమించింది. ఏలూరు రేంజ్ డీఐజీగా రామ్మోహన్‌రావును నియమించారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా పీహెచ్డీ  రామకృష్ణ, నర్సీపట్నం ఓఎస్‌డీగా .. సుమిత్‌ సునీల్‌,  ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా డి.కృష్ణారావు నియమితులయ్యారు. కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌, కర్నూలు ఏఎస్పీగా గౌతమి సాలిను ప్రభుత్వం నియమించింది.

ఇదీ చదవండి : రాజ్యసభకు ముగ్గురు వైకాపా అభ్యర్థులు ఖరారు!

Last Updated : Mar 6, 2020, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details