ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

IPS transfers: రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరెవరు ఎక్కడికి..! - ఏపీలో ఐపీఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

IPS transfers
రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీ

By

Published : May 17, 2022, 1:51 PM IST

Updated : May 18, 2022, 4:35 AM IST

13:49 May 17

ఏసీబీ డీఐజీగా పి.హెచ్‌.డి.రామకృష్ణ బదిలీ

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్, జూనియర్ స్థాయిలో అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. డీజీపీ కార్యాలయంలో ఐజీపీ హోదాలో పని చేస్తున్న ఎల్ కే వి రంగారావుకు పోలీసు సంక్షేమం, క్రీడల విభాగం ఐజీపీగా నియమించారు. అదనపు డీజీ రైల్వే విభాగం అదనపు బాధ్యతలనూ అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 17 మంది ఐపీఎస్​లను పోస్టింగ్​లలో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీపీ క్రీడలు, సంక్షేమంగా ఎల్​కేవీ రంగారావును బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రైల్వే ఏడీజీగానూ అదనపు బాద్యతలు అప్పగించారు. ఎస్వీ రాజశేఖర్ బాబు ఆక్టోపస్ డీఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం.. డీఐజీ శాంతిభద్రతలుగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. పీహెచ్​డి రామకృష్ణ ను ఏసీబీ డీఐజీగా బదిలీ చేసిన సర్కార్​.. టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగానూ ఆయనకు అదనపు బాద్యతలు అప్పగించింది. కేవీ మోహన్ రావును పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీగా బదిలీ చేశారు. విశాఖ రేంజ్ డీఐజీగా ఉన్న ఎస్. హరికృష్ణను కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా అదనపు బాద్యతలు అప్పగించారు. గోపీనాథ్ జెట్టిని గ్రేహౌండ్స్ డీఐజీగా బదిలీ చేసి.. న్యాయవ్యవహారాల ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కోయ ప్రవీణ్​ను 16 బెటాలియన్ కమాండెంట్​గా బదిలీ చేశారు. ఆ స్థానంలో పనిచేస్తున్న డి. ఉదయబాస్కర్​ను పోలీసు హెడ్​ క్వార్టర్​కు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్​గా ఉన్న విశాల్ గున్నీకి విజయవాడ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు ఏపీఎస్పీ 3 బెటాలియన్ కమాండెంట్​గానూ అదనపు బాధ్యతలు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

అనంతపురంలో ఉన్న 14వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ అజితా వేజేండ్లకు గుంతకల్ రైల్వే ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ స్థానంలో పనిచేస్తున్న పి. అనిల్​బాబును పోలీసు హెడ్ క్వార్టర్స్​కు బదిలీ చేశారు. చింతూరు అదనపు ఎస్పీగా ఉన్న జి.కృష్ణకాంత్ రంపచోడవరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్​గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాడేరు అదనపు ఎస్పీ పి.జగదీశ్​ను చిత్తూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేశారు. డి.ఎన్ .మహేష్​ను పోలీసు హెడ్ క్వార్టర్స్ రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. తుహిన్ సిన్హా పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. బిందు మాధవ్ గరికపాటిని పలనాడు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేశారు. పీవీ రవికుమార్​ను విజిలెన్స్​, ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.


ఇవీ చదవండి:

Last Updated : May 18, 2022, 4:35 AM IST

ABOUT THE AUTHOR

...view details